రామగుండం కార్పొరేషన్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరాజయం
కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దాసరి సావిత్రి తన ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిని స్నేహపై 167 ఓట్ల ఆధిక్యంతో కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. తమ అభ్యర్థిని విజయం సాధించడంతో రామంగుండం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. నేతలు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.